హైదరాబాద్ లో ట్రావెల్స్‌‌‌‌ బస్సు బీభత్సం: బైకర్​ను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలు

హైదరాబాద్ లో ట్రావెల్స్‌‌‌‌ బస్సు బీభత్సం: బైకర్​ను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలు

గండిపేట, వెలుగు: నార్సింగిలో ప్రైవేట్ ట్రావెల్స్‌‌‌‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఒకరిని ఢీకొట్టడమే కాకుండా మరో 2 కి.మీ దూరంలో కరెంటుపోల్ ను ఢీకొట్టి ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. అజీజ్‌‌‌‌నగర్​కు చెందిన బి.రాజుయాదవ్‌‌‌‌ గురువారం లంగర్‌‌‌‌హౌస్‌‌‌‌ మీదుగా బైక్​పై వెళ్తున్నాడు. పీరంచెరువు మాక్స్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌ వద్ద కర్నూల్​చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌‌‌‌ బస్సు అతివేగంగా వచ్చి, అతడిని వెనుక నుంచి ఢీకొట్టింది. 

అంతటితో ఆగకుండా మరో 2 కి.మీ దూరంలో టిప్పుఖాన్‌‌‌‌ బ్రిడ్జి ప్రాంతంలో ఓ కరెంటు పోల్‌‌‌‌ను సైతం ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనల్లో రాజు యాదవ్​తోపాటు బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్‌‌‌‌ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.