
ఉప్పల్ వేదికగా రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ లో దంచికొడుతుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీతో సన్ రైజర్స్ జట్టు భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తుంది. 21 బంతుల్లో హెడ్ 6 ఫోర్లు.. 3 సిక్సర్లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ 9 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజ్ లో హెడ్ (63), కిషాన్ (32) క్రీజ్ లో ఉన్నారు.
ALSO READ : NZ vs PAK: ఎనిమిది మంది సింగిల్ డిజిట్: న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిన పాకిస్థాన్
ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ కొట్టిన ఒక సిక్సర్ ఇన్నింగ్స్ కే హైలెట్ గా మారింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా 105 మీటర్ల సిక్సర్ కొట్టాడు. హెడ్ ధాటికి
ఈ ఓవర్ లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఎప్పటిలాగే ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించించింది. తొలి ఓవర్ లోనే 10 పరుగులు.. రెండో ఓవర్ లో 14 పరుగులు వచ్చాయి.. పవర్ ప్లే లో హెడ్, అభిషేక్ శర్మ ధాటికి ఏకంగా 94 పరుగులు రావడం విశేషం. 11 బంతుల్లో 24 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఔటైనా.. కిషాన్ తో కలిసి హెడ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు.
TRAVIS HEAD'S 105M SIX AGAINST JOFRA ARCHER. 🥶🔥pic.twitter.com/XmHKp2yNvo
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2025