SRH vs PBKS: తొలి మ్యాచ్ నుంచి జేబులోనే: అభిషేక్ పరువు తీసిన ట్రావిస్ హెడ్

SRH vs PBKS: తొలి మ్యాచ్ నుంచి జేబులోనే: అభిషేక్ పరువు తీసిన ట్రావిస్ హెడ్

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ తొలిసారి రెచ్చిపోయాడు. శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో ఆకాశమే  చెలరేగాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉప్పల్ స్టేడియాన్ని బౌండరీలతో హోరెత్తించాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న అభిషేక్.. 40 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. పంజాబ్ బౌలర్లను ఊచకోత కోస్తూ  ఓవరాల్ గా 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141  పరుగులు చేశాడు. సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ తన జేబులో పేపర్ చూపిస్తూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. ఆ పేపర్ పై "థిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ" అని రాసి ఉంది. 

2024 ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టిన అభిషేక్ ఈ సీజన్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఐదు మ్యాచ్ ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే పంజాబ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో తన మార్క్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత అభిషేక్ పై సర్వత్రా ప్రశంసలు వస్తుంటే.. సహచర ఓపెనర్ ట్రావిస్ హెడ్.. అభిషేక్ పై చేసిన కామెంట్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. 

►ALSO READ | RR vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. రాజస్థాన్ జట్టులో హసరంగా!

మ్యాచ్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూ లో హెడ్ మాట్లాడుతూ.. " ఆ నోట్ సీజన్ ప్రారంభం నుండి అభిషేక్ జేబులో ఉంది. కానీ 6వ గేమ్‌లో మాత్రమే దానిని బయటకు తీసే అవకాశం అతనికి లభించింది. ఈ రోజు ఆ నోట్ తీసినందుకు చాలా సంతోషంగా ఉంది". అని వెల్లడించాడు. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీర ఉతుకుడు ఉతుకుతూ తొలి వికెట్ కు 12.2 ఓవర్లలోనే 170 పరుగులు జోడించి పటిష్ట స్థితికి చేర్చారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే అభిషేక్ తుఫాన్ ఇన్సింగ్స్‎తో 246 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఎస్ఆర్‎హెచ్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేజ్ చేసి సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా  శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్ పై జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి గెలిచింది.