అడిలైడ్ టెస్టులో టీమిండియా తడబడుతుంది. ఆతిధ్య ఆస్ట్రేలియా వికెట్లు తీయడంలో తీవ్రంగా శ్రమిస్తోంది. భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ ఆసీస్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీ చేశాడు. భారత్ పై అద్భుతమైన రికార్డ్ ఉన్న హెడ్.. మరోసారి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. 109 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న హెడ్ ప్రస్తుతం 120 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. హెడ్ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు.. 14 ఫోర్లున్నాయి.
Also Raed : ఆస్ట్రేలియాకు అనుకూలంగా థర్డ్ అంపైర్ నిర్ణయం
సహచరులు విఫలమవుతున్నా.. ఒక్కడే ఒంటిరిగా వారియర్ లా పోరాడుతున్నాడు. ఈ ఆసీస్ క్రికెటర్ సెంచరీతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 100 పరుగులు దాటింది. రెండో రోజు డిన్నర్ తర్వాత తొలి గంట ఆట ముగిసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. సెంచరీ హీరో హెడ్ (120) కెప్టెన్ కమ్మిన్స్ (1)క్రీజ్ లో ఉన్నారు. ఈ సెషన్ లో ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. మార్ష్ ను అశ్విన్ ఔట్ చేయగా.. క్యారీ వికెట్ ను సిరాజ్ తీసుకున్నాడు.