T20 World Cup 2024: భారత్ మాపై రివెంజ్‌కు సిద్ధంగా ఉంటుంది: ఆసీస్ ఓపెనర్

T20 World Cup 2024: భారత్ మాపై  రివెంజ్‌కు సిద్ధంగా ఉంటుంది: ఆసీస్ ఓపెనర్

క్రికెట్ లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ఇస్తాయి. ముఖ్యంగా టెస్ట్, ఐసీసీ మ్యాచ్ ల్లో వీరి మధ్య మ్యాచ్ లు హోరీహోరీగా జరుగుతాయి. అయితే ఐసీసీ ఫైనల్స్ లో మాత్రం ఆస్ట్రేలియాదే పూర్తి ఆధిపత్యం. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి రెండు ఐసీసీ ఫైనల్స్ లో భారత్ ను చిత్తు చేసి ఆస్ట్రేలియా టైటిల్స్ గెలిచింది. 2023 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇండియా ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. 

రెండు ఐసీసీ ఫైనల్స్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో ఈ పరాజయాన్ని సగటు భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు.ముఖ్యంగా స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడం ఇప్పటికీ బాధిస్తుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వీరోచిత సెంచరీతో మ్యాచ్ ను భారత్ నుంచి దూరం చేశాడు. సొంతగడ్డపై టీమిండియాకు పీడ కళను మిగిల్చాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్న హెడ్.. భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

"భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు వస్తే బాగుంటుంది. ఈ సారి భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తారు". అని హెడ్ అన్నాడు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్లు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నాయి. స్థాయికి తగ్గట్టు ఆడితే ఈ రెండు జట్లను మరోసారి ఐసీసీ ఫైనల్స్ లో చూడొచ్చు. ఒకవేళ రెండు జట్లు ఫైనల్ కు చేరితే ఈ సారి టైటిల్ ఎవరు కొడతారో చూడాలి.