క్రికెట్ లో కరోనా మరోసారి కలవరాన్ని సృష్టిస్తుంది. నిన్నటివరకు న్యూజిలాండ్ ప్లేయర్లు అనుకుంటే తాజాగా ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. వెస్టిండీస్ తో ఇటీవలే అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ముగిసిన తర్వాత ఈ స్టార్ బ్యాటర్ కు కోవిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. జనవరి 23 వరకు హెడ్ ఐసోలేషన్ లో ఉంటాడు. జనవరి 25 నుంచి గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ లో హెడ్ ఆడటం అనుమానంగా మారింది.
హెడ్ కు కరోనా సోకడం ఇది రెండోసారి. 2021 లో ఈ లెఫ్ట్ హ్యాండర్ కు కరోనా వైరస్ సోకడంతో సిడ్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ యాషెస్ టెస్టుకు దూరమయ్యాడు. విండీస్ తో జరిగిన తొలి టెస్టులో హెడ్ వీరోచిత సెంచరీతో ఆస్ట్రేలియాకు ఆధిక్యాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. బౌలింగ్ కు అనుకూలించిన ఈ పిచ్ పై హెడ్ ఒక్కడే సెంచరీతో మెరిశాడు. ఒకవేళ హెడ్ దూరమైతే అతని స్థానంలో రెంషాకు తుది జట్టులో చోటు దక్కుతుంది. మరోవైపు దవడకు గాయమైన ఖవాజా పూర్తిగా కోలుకున్నట్టు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది.
కివీస్ దేశవాళీ టీ20 లీగ్ సూపర్ స్మాష్ లో ఆడిన మిచెల్ సాంట్నర్..డిసెంబర్ నెలలో కోవిడ్ బారిన పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వేకు సైతం కరోనా సోకింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా... ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆండ్రే ఆడమ్ కూడా కరోనా బారిన పడ్డాడని తెలిపింది.
Travis Head tested positive for COVID-19. [The Age]
— Johns. (@CricCrazyJohns) January 22, 2024
- Wishing a speedy recovery for Head. pic.twitter.com/WtTw7Z2GHA