పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్)... ఇదొక హార్మోనల్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా పది మంది ఆడవాళ్లలో ఒకరిని, మనదేశంలో ఐదుగురిలో ఒకరిని వేధిస్తోంది ఈ సమస్య. టీనేజ్ అమ్మాయిల్లో ఈ డిజార్డర్ కనిపిస్తుంది. ఓవరీస్(అండాల) మీద ప్రభావం చూపించే ఈ సమస్య నుంచి బయటపడడానికి న్యూట్రిషనిస్ట్లు చెప్తున్న ఫుడ్ టిప్స్ కొన్ని.
- గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే పప్పులు, నట్స్, గింజలు, పండ్లతో పాటు ప్రాసెస్ చేయని, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఫుడ్, స్టార్చ్ ఎక్కువ ఉండే కూరగాయలు తినాలి. దాంతో ఇన్సులిన్ లెవల్స్ పెరగవు.
- ఆకుకూరలు, బెర్రీ పండ్లు వంటివి తింటే అలసట కూడా తగ్గుతుంది. చేపలు, పౌల్ట్రీ, పండ్లు, కూరగాయలు, ఫ్యాట్ తక్కువ ఉండే డెయిరీ ప్రొడక్ట్స్ తింటే గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుంది.