కరెంట్ తీగలపై పడిన చెట్టు కొమ్మలు

కరెంట్ తీగలపై పడిన చెట్టు కొమ్మలు
  • షాక్ కొట్టి  ఇద్దరు విద్యుత్ సిబ్బందికి గాయాలు
  • నిర్మల్ జిల్లా మామడ మండల సబ్ స్టేషన్ వద్ద ఘటన  

లక్ష్మణచాంద(మామడ)వెలుగు: కరెంట్ షాక్ తో సిబ్బందికి గాయాలైన ఘటన నిర్మల్​జిల్లాలో జరిగింది.  వివరాల్లోకెళ్తే.. మామడ మండల సబ్ స్టేషన్ సిబ్బంది కప్పన్ పల్లి రోడ్ దిమ్మదుర్తి ఫీడర్ ఆర్–7 ఎల్–1 పోల్ వద్ద ఆదివారం మరమ్మతులు చేస్తున్నారు. 

ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మలు విరిగి పక్కన కరెంటు సప్లై ఉన్న తీగలపై పడ్డాయి. దీంతో ఆ తీగలు మరమ్మతులు చేస్తున్న కరెంట్ వైర్లపై పడడంతో విద్యుత్ సిబ్బంది జేఎల్ఎం అనిల్, హెల్పర్ నారాయణ గాయపడ్డాడు. అనిల్ 15 నిమిషాల పాటు స్తంభంపైనే చిక్కుకుపోగా జేసీబీ సాయంతో కిందికి దింపి నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందున్నారు.