హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూలిన చెట్టు... 12మందికి తీవ్ర గాయాలు..ఒకరు మృతి..

తెలంగాణలో గత రెండురోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో చాలా చోట్ల రోడ్లు జలమయమవ్వడంతో నగరవాసులకు ట్రాఫిక్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఓల్డ్ సిటీలో చెట్టు కూలిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంషీర్  గంజ్ ప్రాంతంలో ఓక చెట్టు కులాడంతో 12మందికి తీవ్ర గాయాలవ్వగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

ఘటన గురించి తెలుసుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, ఫలక్నామ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో 4ద్విచక్ర వాహనాలు, 2ఆటోలు ధ్వంసం అయినట్లు సమాచారం.

Also Read:-50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ..