హైవేపై కూలిన చెట్టు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌‌‌ జాం

హైవేపై కూలిన చెట్టు..  5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌‌‌ జాం

గంగాధర, వెలుగు : కరీంనగర్‌‌‌‌ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి కరీంనగర్‌‌‌‌ – జగిత్యాల హైవేపై భారీ చెట్టు కూలిపోయింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్‌‌‌‌రెడ్డి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీని రప్పించి చెట్టును పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌‌‌‌ను పునరుద్ధరించారు.

నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌‌‌‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే గంగాధర మండల శివారులోని రైల్వే గేట్‌‌‌‌వద్ద ట్రాక్, రోడ్డు పూర్తిగా మునిగింది. దీంతో గేట్‌‌‌‌ తెరుచుకోకపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు, సిబ్బంది అతికష్టం మీద గేట్‌‌‌‌ను తెరవడంతో వాహనాల రాకపోకలు తిరిగి కొనసాగాయి.