
మాఘ, ఫాల్గుణ మాసాల్లో వచ్చే శిశిర రుతువు ప్రకృతిలో కొత్త అందాలను తీసుకువస్తుంది. ప్రస్తుతం ఓ వైపు చెట్ల ఆకులు రాలిపోతుంటే.. మరో వైపు కొత్తచిగురు పుట్టుకొస్తోంది. దూరం నుంచి ఏ చెట్టును చూసినా మోడు వారినట్లు కనిపిస్తుండగా, దగ్గరగా చూస్తే కొత్త చిగురు దర్శనమిస్తోంది. నెక్లెస్ రోడ్ లో పూర్తిగా ఆకులు రాలిపోయిన చెట్ల వరుస కనువిందు చేస్తోంది.