
పద్మారావునగర్, వెలుగు : మారేడుపల్లి ప్రాంతంలోని ఏఓసీ గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ చెట్టు వాహనదారులకు ఇబ్బందిగా మారింది. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజ్ ఆధ్వర్యంలో గురువారం ఆ చెట్టును అక్కడి నుంచి తొలగించారు.
జేసీబీ సాయంతో కిలోమీటర్ దూరంలోని ఆర్మీ ఏరియాలో ట్రాన్స్‌లొకేషన్ చేశారు.