అధికార పార్టీ ఆర్భాటానికి పచ్చని చెట్లు బలి

అధికార పార్టీ ఆర్భాటానికి పచ్చని చెట్లు బలైయ్యాయి. కరీంనగర్ LMD కాలనీ మహాత్మా నగర్ లో మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం స్థానిక బీఆర్ఎస్ నేతలు పచ్చని చెట్లను నరికేశారు. దీంతో వేడుకల కోసం భారీ వృక్షాలను నరకడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా అధికార పార్టీకి చెందిన మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జనం భోజనాల కోసం స్థలం లేకపోవడంతో.. భారీ వృక్షాలు నరికి తరలించేందుకు బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం చూపారు. నేతల నిర్వాకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.