బిగ్ బ్రేకింగ్ : వయనాడ్ లో భూమి నుంచి భారీ శబ్దాలు.. ఖాళీ చేసి వెళుతున్న జనం..

బిగ్ బ్రేకింగ్ : వయనాడ్ లో భూమి నుంచి భారీ శబ్దాలు.. ఖాళీ చేసి వెళుతున్న జనం..

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వయానాడ్ మళ్లీ వణికిపోతుంది. మొన్నటికి మొన్న జల ప్రళయానికి భారీ దెబ్బతిన్న ప్రాంతాల్లో భూమి నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయి. 2024, ఆగస్ట్ 9వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. మెప్పాడి, అనప్పర, తాజాతువాయల్, వినంగోడు, నెన్మేని, వైత్తిరి ప్రాంతాల్లో పలుసార్లు ప్రకంపనలు వచ్చాయి. భూమి నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. 

భూమి నుంచి శబ్దాలు, పలుసార్లు ప్రకంపనలు రావటంతో.. ఆయా ప్రాంతాల్లోని జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చే అవకాశం ఉందన్న అధికారుల సూచనలతో.. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కాలేజీల్లో ఉన్న స్టూడెంట్స్ ను ఇంటికి పంపించారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు.. ప్రకంపనలు వస్తున్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. 

Also Read:-సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం సినిమా వేస్తున్నారు.. ఇంతకీ ఏంటా సినిమా?

విషయం తెలిసిన వెంటనే కేరళ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అధికారుల బృందాలను వయనాడ్ ప్రాంతాలకు పంపిస్తుంది. ఈ అధికారుల బృందంలో జియాలజిస్టులు ఉన్నారు.