రూ. కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా!

రూ. కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా!
  • ప్రభుత్వ బోర్డును తొలగించి, జేసీబీతో స్థలం చదును
  • ఆర్జేఏ పోలీసులకు ఎంఆర్వో ఫిర్యాదు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిపై అక్రమార్కులు కన్నేశారు. ఇక్కడి సర్వే నంబర్​626లో ప్రభుత్వానికి దాదాపు 2 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించారని ఫిర్యాదు రావడంతో ఎంఆర్వో రవీందర్ దత్తు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ప్రభుత్వ స్థలం బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, శనివారం రాత్రి ఈ బోర్డును పక్కనే ఉన్న సాయి బాలాజీ వెంచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి తొలగించినట్లు స్థానికులు ఆరోపించారు.

స్థలాన్ని జేసీబీతో చదును చేయించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఎకరం భూమి దాదాపు రూ.10 కోట్ల పైనే ఉందన్నారు. మరోవైపు, ప్రభుత్వ స్థలంలో పని చేయిస్తున్న అనంతయ్య, బీమ్​ రావుపై శంషాబాద్ ఆర్జేఏ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎంఆర్వో రవీందర్ దత్తు తెలిపారు. కబ్జాకు యత్నించిన వ్యక్తుల వద్ద ఎలాంటి పత్రాలు ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగానే గుర్తించామని స్పష్టం చేశారు.