శ్రీలంకలో ట్రై సిరీస్.. ఇండియా జట్టులో హైదరాబాద్ పేసర్ అరుంధతికి చోటు

శ్రీలంకలో ట్రై సిరీస్.. ఇండియా జట్టులో హైదరాబాద్ పేసర్ అరుంధతికి చోటు

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న హర్మన్ శ్రీలంక వేదికగా ఈ నెల 27 నుంచి జరిగే వన్డే  ట్రై -సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడిపించనుంది. శ్రీలంక, సౌతాఫ్రికా పాల్గొనే ఈ సిరీస్ కోసం బీసీసీఐ విమెన్స్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును మంగళవారం ఎంపిక చేసింది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్న ఈ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డికి చోటు దక్కింది.

గాయాల కారణంగా ప్రధాన పేసర్లు రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యారు. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్ కశ్వీ గౌతమ్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్ తొలిసారి నేషనల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చారు. ఈ సిరీస్ డబుల్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది. ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడుతుంది. 

ఇండియా టీమ్ జట్టు:

హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(కెప్టెన్), మంధాన (వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్, జెమీమా, రిచా ఘోష్ (కీపర్), యాస్తికా భాటియా (కీపర్), దీప్తి శర్మ, అమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసబ్నిస్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్.