మనోహరాబాద్ కొత్తపల్లి రూట్​లో.. ట్రయల్ రన్ విజయవంతం

  దుద్దెడ నుంచి సిద్దిపేట రైల్వేస్టేషన్​ వరకు రైలు నడిపిన అధికారులు

సిద్దిపేట రూరల్, వెలుగు:  మనోహరాబాద్–కొత్తపల్లి రైలు మార్గంలో భాగంగా సిద్దిపేట వరకు పూర్తయిన రైల్వే ట్రాక్ పై శుక్రవారం రైల్వే సేఫ్టీ అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది.120 కిలోమీటర్ల వేగంతో రైలును దుద్దెడ నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్ వరకు పలుమార్లు తిప్పారు. రైలు వేగంగా వెళ్లినా ట్రాక్ పై ఎలాంటి లోపాలు తలెత్తలేదు. ఈసందర్భంగా అధికారులు రైల్వేస్టేషన్, ప్లాట్​ఫాం, సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్  పనులను పరిశీలించారు.

ALSO READ: రేపు ‘యశోభూమి’ ఓపెనింగ్.. భారత్ మండపం కంటే పెద్దది

ట్రయల్ రన్ విజయవంతం కావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రైలు నడిపేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ట్రయల్ రన్​ను రైల్వే సేఫ్టీ ఆఫీసర్లు సీఆర్ఎస్ ప్రంజీవ్ సక్సేనా, సీఏవో నీరజ్ అగర్వాల్, సీఏ అమిత్ అగర్వాల్, డిప్యూటీ సీఆర్ఎస్ శ్రీనివాస్, డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్, బాలాజీ కిరణ్, డిప్యూటీ సీఈ సంతోష్ కుమార్ పరిశీలించారు.