మల్కాపూర్‌‌ చెరువులో యుద్ధ ట్యాంకుల ట్రయల్స్‌‌

మల్కాపూర్‌‌ చెరువులో యుద్ధ ట్యాంకుల ట్రయల్స్‌‌
  • సంగారెడ్డి ఓడీఎఫ్‌‌లో తయారైన వెహికల్స్

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం ఓడీఎఫ్‌‌ ఫ్యాక్టరీలో తయారు చేసిన యుద్ధ ట్యాంకులకు ఓడీఎఫ్‌‌, ఆర్మీ ఆఫీసర్ల ఆధ్వర్యంలో గురువారం మల్కాపూర్‌‌ చెరువులో ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించారు. ఓడీఎఫ్‌‌ చీప్‌‌ జనరల్‌‌ మేనేజర్‌‌ ఎస్‌‌ఎస్‌‌ ప్రసాద్ ఆధ్వర్యంలో యుద్ధ ట్యాంకర్లను చెరువులో మూడు గంటల పాటు రన్‌‌ చేశారు. 

యుద్ధ క్షేత్రంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా ఈ ట్యాంకులను తయారు చేశామని, ఎడారిలో, బురదలో, నదులు, కాలువల్లో కూడా ఈజీగా ప్రయాణించేలా రూపొందించినట్లు ఆఫీసర్లు తెలిపారు. 

నీళ్లపై తేలియాడుతున్న బీఎంపీ వాహనాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. 14 టన్నుల బరువున్న వాహనాలు నీటిలో పడవలా తేలియాడడాన్ని స్థానికులను ఆసక్తిగా చూశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ జీఎం రత్న ప్రసాద్, క్వాలిటీ మేనేజర్లు, ఓడీఎఫ్‌‌ 
ఉద్యోగులు పాల్గొన్నారు.