
అవును.. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇది ఓల్డ్ టైటిల్.. కొత్త టైటిల్ ఏంటో తెలుసా.. అవును.. వాళ్ల ముగ్గురూ ప్రేమించుకున్నారు. అది కూడా ఎదురెదురుగా కాదు.. సోషల్ మీడియాలో. ఇన్ స్ట్రాగ్రాంలో పరిచయం.. ఒకే అబ్బాయిని.. ఇద్దరు అమ్మాయిలు గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఓ యువతి చనిపోగా.. మరో యువతి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉంది.. ఆ అబ్బాయి మాత్రం మాయం అయ్యాడు. ఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత ఆసక్తికరంగానే కాకుండా.. సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం గెరిశినపల్లి గ్రామానికి చెందిన బెస్త దివాకర్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. అతను ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టులు పెడుతూ ఉంటాడు. తన ఫాలోవర్స్ లోని ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు దివాకర్. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా దివాకర్ ను అత్యంత గాఢంగా ప్రేమించారు.
దివాకర్ ప్రేమించిన అమ్మాయిల వివరాలు చూస్తే..
ఓ అమ్మాయి పేరు శారద. వయస్సు 20 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. మరో అమ్మాయి పేరు రేష్మా. వయస్సు 20 ఏళ్లు. కొన్నాళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇన్ స్ట్రాగ్రాం ప్రేమికుడు దివాకర్ కోసం విడాకులు ఇచ్చేసింది. ఈ యువతులు ఇద్దరూ దివాకర్ ను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో దివాకర్.. ఎవర్ని పెళ్లి చేసుకోవాలి అనే అనుమానం వచ్చింది. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలని ఆ ఇద్దరు యువతులు పట్టుబట్టారు. దీంతో దివాకర్ డైలమాలో పడ్డాడు.
పెళ్లి విషయం తేల్చుకోవాలని ఇద్దరు యువతులు దివాకర్ దగ్గర వచ్చారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. ఇద్దరం ప్రేమించింది ఒక్కరినే అని.. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇద్దరు యువతులు.. పురుగుల మందు తాగారు. ఆర్టీఏ ఆఫీస్ ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న ఈ ఇద్దరు యువతులను గమనించిన స్థానికులు.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పురుగుల మందు తాగిన ఇద్దరు యువతుల్లో.. రేష్మా చనిపోగా.. శారద మాత్రం చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
దివాకర్ ఇద్దరినీ ప్రేమించాడని.. ఆ ఇద్దరు యువతులు కూడా దివాకర్ ను ప్రేమించారని.. పెళ్లి విషయం వచ్చేసరికి.. ఈ బండారం బయటపడిందని చెబుతున్నారు. ఈ ముగ్గురూ ఇన్ స్ట్రాగ్రాం ద్వారానే పరిచయం అయ్యారని.. ప్రేమ కూడా అక్కడే మొదలైందని చెబుతున్నారు పోలీసులు.
సోషల్ మీడియాలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. రియల్ జీవితంలో మాత్రం విషాధంగా మారటం చర్చనీయాంశం అయ్యింది.