ఏకలవ్య కార్పొరేషన్​ పెట్టండి

ఏకలవ్య కార్పొరేషన్​ పెట్టండి
  • మంత్రి సీతక్కను కోరిన ఆదివాసీ ఎరుకల సంఘం

ముషీరాబాద్, వెలుగు: ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రూ.500 కోట్ల బడ్జెట్​ కేటాయించి పాలకమండలి ఏర్పాటు చేయాలని కోరింది. శుక్రవారం తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు హైదరాబాద్ లో  పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు సంఘాల అధ్యక్షులు లోకిని రాజు, శ్రీరామ్ సదానందం మాట్లాడుతూ..  8  లక్షల జనాభా ఉండి అన్ని రంగా ల్లో వెనకబడి ఉన్నామన్నారు.

గత బీఆర్ఎస్ సర్కారు తమను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిజాంపేటలో నిర్మించిన ఏకలవ్య బిల్డింగ్​ను త్వరగా ప్రారంభించాలని మంత్రిని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, కోనేటి నరసింహ, శ్రీరామ్ ఆనంద్ పాల్గొన్నారు.