బాలు నాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలి .. గిరిజన సంఘం నేతలు

కొండమల్లేపల్లి, వెలుగు: దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలని గిరిజన సంఘం నేతలు కోరారు. శనివారం మండల  సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్‌ కట్ చేసి స్వీట్లు  పంచి పెట్టారు.  అనంతరం  స్థానిక పాలకేంద్రంలో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  వెనుకబడిన ప్రాంతమైన దేవరకొండ అభివృద్ధి చెందాలంటే  బాలునాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.

గిరిజన కోటాలోనూ ఆయన అందుకు అర్హుడేనని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి,  సీనియర్ నేతలు  లాలూ నాయక్,  వేమన్ రెడ్డి,  గంధం సురేశ్,  సర్పంచులు గడ్డం శ్రీరాములు , రామావత్ రవి నాయక్, అందుగుల లింగయ్య, కోట్ల జగదీశ్, కైసర్ ఖాన్, కె.పాండు, మల్లేశ్​, సుధాకర్ పాల్గొన్నారు.