ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి : రాష్ట్ర గిరిజన కో–ఆపరేటివ్​ కార్పొరేషన్​ చైర్మన్ తిరుపతి

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి : రాష్ట్ర గిరిజన కో–ఆపరేటివ్​ కార్పొరేషన్​ చైర్మన్ తిరుపతి

దండేపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన కో–ఆపరేటివ్​ కార్పొరేషన్​ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. దండేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్​నిర్మాణానికి, ధర్మారావుపేటలో 104 మందికి  ఇండ్లు మంజూరవగా శుక్రవారం భూమి చేశారు. లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఎంపీవో విజయ్ ప్రసాద్, హౌసింగ్ ఏఈ లాయక్ అలీ, మాజీ ఎంపీపీలు గడ్డం శ్రీనివాస్, జాబు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

లక్సెట్టిపేట, వెలుగు: మండలంలోని కొత్తూరులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర గిరిజన కో–ఆపరేటివ్​ కార్పొరేషన్​ చైర్మన్ కొట్నాక తిరుపతి శుక్రవారం భూమిపూజ చేశారు. మొత్తం15 చోట్ల ముగ్గు పోశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, పంచాయతీ కార్యదర్శి రాజేశ్, కాంగ్రెస్ నాయకులు నల్లిమెల రాజు, గుండ బుచ్చన్న, అంకతి శ్రీనివాస్, బొప్పు సుమన్, గుండ శ్రీనివాస్, చెరుకు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.