లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. వెల్ఫేర్ ఆఫీసులో సంతకం కోసం లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు వేసిన వలలో అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పడింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో జగ జ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తుంది.
ఓ వ్యవహారంలో తన సంతకం కోసం జగ జ్యోతి బాధితుడిని నుంచి రూ. 84 వేలు లంచం డిమాండ్ చేసింది. బాధితుడు దిక్కుతోచని స్థితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు జగ జ్యోతి ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆధారాలు బలంగా ఉండటంతో జగ జ్యతి పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.