రెజ్లింగ్​ జాతీయస్థాయి పోటీలకు గిరిజన బాలిక

భద్రాచలం,వెలుగు :  భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అంకంపాలెం ఆశ్రమ హైస్కూల్​లో 9వ తరగతి చదువుతున్న రవ్వ గీతా హర్షిణి జాతీయస్థాయి రెజ్లింగ్​ పోటీలకు ఎంపికైంది. సోమవారం బాలికను పీవో ప్రతీక్​జైన్​ తన చాంబర్​లో అభినందించారు. ఈనెల 7,8 తేదీల్లో హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్​ పోటీల్లో ఛాంపియన్​షిప్​తో పాటు గోల్డ్ మెడల్​ సాధించిన గీతా హర్షిణీ పంజాబ్​లోని పాటియాలాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. జాతీయస్థాయిలో రాణించాలని పీవో ప్రతీక్​ జైన్​, డీడీ మణెమ్మ, ఏపీవో జనరల్ డేవిడ్ ​రాజ్​ బాలికకు సూచించారు.