
- మా తండాకు ఎమ్మెల్యే పద్మ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్
- మెదక్ జిల్లా జెడ్చెర్వులో ఘటన
నిజాంపేట, వెలుగు : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మద్దతుగా మంగళవారం మండల పరిధిలోని జెడ్ చెర్వు గ్రామంలో ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్లీడర్ల ఎదుట గిరిజనులు జై కాంగ్రెస్ నినాదాలు చేశారు. దీంతో లీడర్లు వారిని ఆపేందుకు వెళ్లగా తమ తండాకు ఎమ్మెల్యే ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.
‘ఎలక్షన్లు వచ్చినయని ఈ రోజు ఎమ్మెల్యే మా తండాకు వస్తున్నరు. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలే. మేము ఏం అంటలేమనా? తండాలో డబుల్ బెడ్ రూమ్ లు ఎవలకిచ్చిన్రు. మూడెకరాల భూమి ఎవరికిచ్చిన్రు?’ అని నిలదీశారు. తండాను ఏం డెవలప్ మెంట్ చేసిన్రో చెప్తే మేమే ఎమ్మెల్యేను ప్రచారానికి తీసుకుపోతం’ అని అన్నారు. దీంతో వారికి నచ్చజెప్పి పంపించారు.