డబుల్ ​బెడ్రూం ఇండ్ల కేటాయింపును ఆపాలి : ఆదివాసీ సంఘం లీడర్లు

డబుల్ ​బెడ్రూం ఇండ్ల కేటాయింపును ఆపాలి : ఆదివాసీ సంఘం లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రిలో గ్రామసభలు లేకుండా డబుల్​ బెడ్రూం ఇండ్ల కేటాయింపు ఎలా చేస్తారని, కార్యక్ర మాన్ని నిలిపివేయాలని ఆదివాసీ సంఘం లీడర్లు డిమాండ్ ​చేశారు. మంగళవారం మందమర్రి తహసీల్దార్​ సతీశ్ కుమార్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామసభలు, గ్రామ కమిటీల నిర్వహించకుండా బుధవారం లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలని ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారని, దీన్ని విరమించుకోవాలన్నారు. ఇది ఏజెన్సీ యాక్ట్​కు విరుద్ధమన్నారు. ఆదివాసీ సంఘం నాయకులు రాజకుమార్, భార్గవ్, బైరనేని లక్ష్మణ్, శ్రీనివాస్, భీంసేన్, అరుణ్​, రాయమల్లు, రమణ, రాజేశ్​తదితరులు పాల్గొన్నారు. 

అవకతవకలు జరిగాయని సంఘాల ఫిర్యాదు

డబుల్ ​బెడ్రూం ఇండ్ల కోసం ప్రకటించిన లబ్ధిదారుల లిస్టులో పలు అవకతవకలు జరిగా యని.. అనర్హులు, సొంత ఇండ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో వచ్చాయని పలు సంఘాలు ఫిర్యాదు చేశాయి. బుధవారం ఉదయం 11 గంటలకు మందమర్రి సింగరేణి సీఈఆర్ క్లబ్​లో లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇండ్లు కేటాయిస్తామని తహసీల్దార్ సతీశ్ కుమార్​ తెలిపారు.