
నెల్లికుదురు, వెలుగు : రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లిలో గురువారం నిర్వహించిన ఆశీర్వాద యాత్రలో ఆయన మాట్లాడారు.
బీజేపీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నెల్లికుదురు మండల అధ్యక్షుడు చందు రాజ్‌కుమార్, సురేందర్, సందీప్, సాయి, సుందర్ పాల్గొన్నారు.