ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నరు : హుస్సేన్‌‌‌‌ నాయక్‌‌‌‌

మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు : తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌‌‌‌ నాయక్‌‌‌‌ చెప్పారు. జిల్లా అధ్యక్షుడు రామచందర్‌‌‌‌రావు అధ్యక్షతన ఆదివారం స్థానికంగా జరిగిన పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌ అధ్యక్షుల మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మానుకోటలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం అనేక నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు ఎడ్ల అశోక్‌‌‌‌రెడ్డి, రాచకొండ కొమురయ్య, శశివర్ధన్‌‌‌‌రెడ్డి, లక్ష్మణ్, సిద్ధార్థరెడ్డి, సురేందర్, పాపారావు, పద్మ, వెంకన్న, శ్యాంసుందర్‌‌‌‌శర్మ, సింగారపు సతీశ్‌‌‌‌, నరసింహారెడ్డి పాల్గొన్నారు.