మహబూబాబాద్ అర్బన్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా గురువారం మహబూబాబాద్ పట్టణంలోని హనుమంతుని గడ్డ, ఆర్టీసీ బస్టాండ్, వేణుగోపాల స్వామి గుడి ఏరియాల్లో పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మానుకోట ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ లీడర్లు మాధవపెద్ది శశివర్ధన్‌రెడ్డి, బోయినపల్లి లక్ష్మణ్‌రావు, శ్యాంసుందర్ శర్మ, ఎర్రంరెడ్డి సిద్ధార్థరెడ్డి, సందీప్, సంపత్ పాల్గొన్నారు.