భద్రాద్రిలో ఆకట్టుకుంటున్న ట్రైబల్‌‌ మ్యూజియం

భద్రాద్రిలో ఆకట్టుకుంటున్న ట్రైబల్‌‌ మ్యూజియం
  • ఆదివాసీల ఆచారాలుకళ్లకు కట్టేలా నిర్మాణం
  • శ్రీరామనవమి రోజున ప్రారంభోత్సవం

భద్రాచలం, వెలుగు : ఇటు టెంపుల్‌‌టౌన్‌‌గా, అటు టూరిజం స్పాట్‌‌గా ఉన్న భద్రాచలం మరిన్ని హంగులు అద్దుకుంటోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులకు ఇక్కడి ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిచయం చేసే లక్ష్యంతో ఐటీడీఏ పీవో బి.రాహుల్‌‌ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ట్రైబల్‌‌ మ్యూజియం ఆకట్టుకుంటోంది. ఆదివాసీలు వాడే దుస్తులు, గిన్నెలు, వ్యవసాయ, వృత్తి పనిముట్లు, ఇతరత్రా వస్తువులు, కళాకృతులు, వారి కొలుపులు, దేవతల విగ్రహాలు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లకు సంబంధించిన విశేషాలను మ్యూజియంలో పొందుపరిచారు.

గిరిజనుల వంటకాలతో స్టాల్స్‌‌ కూడా ఏర్పాటుచేశారు. పర్యాటకుల కోసం బోటింగ్, బాక్స్‌‌ క్రికెట్‌‌, బీచ్‌‌ వాలీబాల్, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌‌ గ్రౌండ్స్‌‌ రూపొందించారు. ఈ మ్యూజియంను శ్రీరామనవమి రోజు ప్రారంభించబోతుండడం విశేషం. ఇప్పటికే కలెక్టర్‌‌ జితేశ్‌‌ వి.పాటిల్‌‌ ‘ఏరు’ పేరుతో గోదావరి తీరంలో హట్స్,సెల్ఫీ పాయింట్లు, తుమ్మల చెరువులో బోటింగ్, కనిగిరి గుట్టల్లో ట్రెక్కింగ్, కిన్నెరసానిలో బోటింగ్​ఏర్పాటు చేయడం విశేషం. టూరిస్ట్‌‌లు ఎంతో థ్రిల్‌‌గా ఫీల్‌‌ అయ్యేలా మ్యూజియంను రూపుదిద్దినట్లు పీవో రాహుల్‌‌ తెలిపారు.