పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని యానంబైల్, ప్రభాత్నగర్గ్రామపంచాయతీలలో ఉన్న నర్సరీలను గిరిజనుల పంచాయతీ అధికారి కె.రాజీవ్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ మండలంలోని కార్యదర్శులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజూ పారిశుధ్య పనులు100శాతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వేసవిలో నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి బొగ్గా నారాయణ, గ్రామపంచాయతీ కార్యదర్శులు దేవ్‌సింగ్, రమేశ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.