కలెక్టరేట్ వద్ద ఆదివాసీల ధర్నా 

కలెక్టరేట్ వద్ద ఆదివాసీల ధర్నా 
  • ఆఫీసు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం
  • పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట
  • కలెక్టర్ కు వినతిపత్రం అందించిన నేతలు

ఆదిలాబాద్, వెలుగు :  రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివాసీ నేతలు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో.. ఇరువర్గా మధ్య తోపులాట జరిగింది.

అయినా.. ఆగకుండా గ్రీవెన్స్ ఆఫీసు వద్దకు వెళ్లడంతో కలెక్టర్ రాజర్షి షా బయటకు రాగా.. ఆదివాసీ నేతలు వినతి పత్రం తీసుకున్నారు. అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్​ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎలాంటి షరతులు లేకుండా  రుణ మాఫీ చేయాలని, రైతు భరోసా, క్వింటాల్ పత్తికి రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోడు రైతులకు హక్కు పత్రాల హామీ నెరవేర్చాలన్నారు. తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళ సంఘం అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిర పాల్గొన్నారు.