మంత్రి వర్గంలో బంజారాలకు చోటు కల్పించాలి : వెంకటేశ్​చౌహాన్​

మంత్రి వర్గంలో బంజారాలకు చోటు కల్పించాలి : వెంకటేశ్​చౌహాన్​

ఖైరతాబాద్, వెలుగు: మంత్రివర్గంలో బంజారా సామాజిక వర్గానికి చోటు కల్పించాలని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్​వెంకటేశ్​చౌహాన్​డిమాండ్​చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటులో బంజారా సామాజిక వర్గం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. 40 నియోజకవర్గాల్లో తమ సామాజికవర్గ ఓట్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. 

బంజారా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారని, వారిలో ఇద్దరికి మూడో తేదీన జరిగే మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. గిరిజన జేఏసీ అధ్యక్షుడు అశోక్​రాథోడ్​ మాట్లాడుతూ తమ రాజకీయ వాటా గురించి రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్​దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐతరాజు అబ్బేందర్, రాజేశ్ నాయక్​, సురేశ్ నాయక్​, లచ్చు మహారాజ్, కొర్రా లక్​పత్ నాయక్​, నారాయణ నాయక్ పాల్గొన్నారు.