
- ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎం.వెంకటేష్ చౌహన్
ముషీరాబాద్, వెలుగు: గిరిజన శక్తి రాష్ట్ర, జిల్లా కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఆ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎం. వెంకటేష్ చౌహన్ ప్రకటించారు. గురువారం తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. గత 8 ఏండ్లుగా రాజ్యాంగ హక్కులు, గిరిజన సమాజ అభ్యున్నతి, గిరిజన వర్సిటీ కోసం తమ ఆర్గనైజేషన్ అలుపెరుగని పోరాటం చేసిందని గుర్తు చేశారు.
గిరిజన శక్తిని గ్రామస్థాయిలో బలంగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున యువ నాయకత్వానికి జిల్లా, రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గిరిజన శక్తిని పటిష్టంగా ఉంచడానికి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవస్థాపక సభ్యులకు సంబంధం లేకుండా ఎవరైనా గిరిజన శక్తి పేరు వాడుకున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.