
భద్రాచలం, వెలుగు: ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో బుధవారం భద్రాచలం గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్స్ ను ప్రారంభించారు. సాంస్కృతిక వైవిధ్యం సౌత్ ఆఫ్ ఇండియా అన్న అంశంపై నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఐటీడీఏ భద్రాచలం నుంచి గిరిజనులు తమ ఉత్పత్తులతో వెళ్లి స్టాల్స్ ఏర్పాటు చేశారు.
మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్మోటా సహకారంతో ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు, ప్రజలకు తెలిసేలా ఐటీడీఏ భద్రాచలం నుంచి ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించిన సిబ్బందిని వారు తయారు చేస్తున్న ఉత్పత్తులను పంపించారు. ఈ నెల 9 వరకు అక్కడ అమ్మకాలు జరపనున్నారు. ఈ ప్రోగ్రాంలో మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళల నుంచి మహిళలు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు.