దేశ వ్యాప్తంగా వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో ఒడిశాలో భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. ఎడతెరిపిలేని వానలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు గంజాం జిల్లా బెర్హంపూర్లో స్కూల్ వెళ్లేందుకు గిరిజన విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. తమ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు నదిని దాటాలి. అయితే భారీ వానలతో నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో విద్యార్థులు నదికి ఇరు వైపులా తాడు ఏర్పాటు చేసుకుని దాటుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.