వికారాబాద్, వెలుగు: వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధ వహించకూడదని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.శరత్ అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వహించకుండా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వంట గది, స్టోర్ రూమ్‌ను పరిశీలించి, బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డిప్యూటీ డైరెక్టర్ చందన సర్పె, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, తహసీల్దార్ తారాసింగ్ ఉన్నారు.