విద్యార్థి దశలోనే భవిష్యత్​కు బాటలు వేయాలి : గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్  సెక్రెటరీ శరత్

విద్యార్థి దశలోనే భవిష్యత్​కు బాటలు వేయాలి : గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్  సెక్రెటరీ శరత్

నర్సాపూర్, వెలుగు: ప్రతి విద్యార్థి సమయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థి దశలోనే భవిష్యత్​కు బాటలు వేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ సూచించారు. ఆదివారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి బాగా చదివి కాలేజీకి, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

 ప్రిన్సిపల్ శ్రీనివాస్ విద్యార్థుల తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీని కోరగా వెంటనే స్పందించి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గురుకులం వోఎస్ డీ శ్రీనివాస్ రెడ్డి , మెదక్ జోన్ ఆర్​సీ గంగారాం నాయక్, ప్రిన్సిపాల్  శ్రీనివాస్ రాయ్,  వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ కిషోర్ పాల్గొన్నారు.