![తప్పుడు రిపోర్ట్స్అప్లోడ్ చేస్తే చర్యలు : ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి](https://static.v6velugu.com/uploads/2025/02/tribal-welfare-deputy-director-ramadevi-warns-against-neglecting-duties_48KHO3VQ2N.jpg)
కాగజ్ నగర్, వెలుగు: అంకితభావంతో పనిచేస్తేనే ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయగలరని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవన్నారు. బుధవారం కౌటాల మండలం మొగడ్ ధగడ్ ఆశ్రమోన్నత పాఠశాలలో కౌటాల, చింతల మానే పల్లి, బెజ్జూర్ మండలాల గిరిజన పాఠశాల హెచ్ఎంలతో మీటింగ్ నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో కొనసాగుతున్న స్కూల్ లో మెరుగైన భోధన చేపట్టాలన్నారు. టీచర్లు, సీఆర్టీలు విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
కౌటాల మండలం గురుడుపేట్ గిరిజన స్కూల్లో పనిచేసే సీఆర్టీ శారద అనుమతి లేకుండా గైర్హాజరు కావడంతో ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. ఐటీడీఏ పీవో స్కూళ్ల పనితీరు, భోధనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. జీసీడీవో శకుంతల, కాగజ్ నగర్ ఏటీడీవో ఖమర్ హుస్సేన్, కాంప్లెక్స్ హెచ్ఎంలు అశోక్ కుమార్, సీహెచ్ ప్రసాద్, టీచర్లు పాల్గొన్నారు. అనంతరం గిరిజన పాఠశాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఆత్రం దేవయ్యను సన్మానించారు.