నేషనల్ అథ్లెటిక్స్​కు ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్ టెకం సాయి ప్రసాద్ఎంపిక

నేషనల్ అథ్లెటిక్స్​కు ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్  టెకం సాయి ప్రసాద్ఎంపిక

తిర్యాణి, వెలుగు: నేషనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు తిర్యాణి మండలంలోని పంగిడి మాదర ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ టెన్త్​క్లాస్ స్టూడెంట్ టెకం సాయి ప్రసాద్ ఎంపికైనట్లు హెచ్​ఎంహెం గోపాల్, పీడీ లక్ష్మణ్ తెలిపారు.

ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సాయి ప్రసాద్​ప్రతిభ కనబరిచాడని, దీంతో ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరిగే నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. స్టూడెంట్​ను సర్పంచ్ జంగు, ఎంపీటీసీ కేశవరావు తదితరులు అభినందించారు.