- మేడారంలో వనమూలికలు అమ్ముకునే మహిళతో చిట్ చాట్
- తన వద్ద అటవీ జంతువుల భాగాలున్నాయన్న చెంచు లక్ష్మి
- సోషల్మీడియాలో వీడియో వైరల్
- అరెస్ట్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు
ములుగు, వెలుగు : మేడారం జాతరలో యూట్యూబర్కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహిళ తన దగ్గర అటవీ జంతువులకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని చెప్పింది. దీంతో ఈ వీడియో వైరల్కావడంతో చూసిన ఫారెస్ట్ అధికారులు వైల్డ్ఆనిమల్స్యాక్ట్ ఉల్లంఘించారంటూ ఆమెను అరెస్ట్ చేశారు. ఫారెస్ట్అధికారుల కథనం ప్రకారం..భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెంచుకాలనీకి చెందిన లక్ష్మి ప్రకృతి వైద్యం చేసేది. మేడారం జాతరలో వనమూళికల షాప్ పెట్టుకుంది.
ఓ యూట్యూబర్వచ్చి లక్ష్మి వద్ద మైక్పెట్టి వీడియో తీస్తూ ఏ రోగానికి ఏ మందులు ఉన్నాయని అడిగాడు. అన్నింటికీ సమాధానం చెప్పిన లక్ష్మి అత్యుత్సాహంతో తన వద్ద ముంగీస, నక్క తోక, ఇతర జంతువుల చర్మం, గోర్లు, ఇలా అనేక భాగాలున్నాయని చెప్పింది. ఇది తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో వైరల్అయ్యింది. విషయం కాస్తా ఫారెస్ట్ ఆఫీసర్ల వరకు వెళ్లడంతో వారు ఎంక్వైరీ చేసి చెంచుకాలనీలోని లక్ష్మి ఇంటిని సోదా చేశారు.
అక్కడ వారికి అటవీ జంతువుల అవయవాలు, వస్తువులు దొరకడంతో సీజ్ చేసిన ములుగు రేంజ్ ఆఫీసుకు తరలించారు. లక్ష్మిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ములుగు డీఎఫ్వో రాహుల్కిషన్జాదవ్ వైల్డ్ లైఫ్అధికారులు, సిబ్బందిని అభినందించారు. కేసును ఫారెస్ట్మొబైల్పార్టీకి అప్పగించారు. ఫారెస్ట్ రేంజర్లు శంకర్, శీతల్, బీట్ఆఫీసర్లు చిస్తీ, రవీనా, సీతారాం, వసంత పాల్గొన్నారు.