డేడ్రా గ్రామంలో మహిళపై చిరుత పులి దాడి

డేడ్రా గ్రామంలో మహిళపై చిరుత పులి దాడి
  • ముఖంపై తీవ్ర గాయాలు.. రిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలింపు
  • ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా డేడ్రాలో ఘటన

బజార్ హత్నూర్, వెలుగు: ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా బజార్ హత్నూర్ మండలం డేడ్రా గ్రామంలో ఓ మహిళపై చిరుత పులి దాడి చేసింది. అర్క భీమ్ బాయి(55) శనివారం ఉదయం 5 గంటలకు గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్తున్న క్రమంలో చిరుత పులి ఆమెపై దాడి చేయడంతో గట్టిగా కేకలు వేసింది. అది విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపే చిరుత సమీప అడవిలోకి పారిపోయింది. 

దాడిలో బాధితురాలి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను బజార్ హత్నూర్ లోని పీహెచ్‌‌‌‌‌‌‌‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌‌‌‌‌‌‌‌బీవో తిరుపతి బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అటవీ శాఖ నుంచి తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేశామని తెలిపారు. అడవి సమీప గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని  సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కొండా సురేఖ

హైదరాబాద్,వెలుగు: మహిళపై చిరుత పులి దాడి ఘటనపై మంత్రి కొండా సురేఖ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన వివరాలను పీసీసీఎఫ్ డోబ్రియాల్‌‌‌‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి తెలుసుకున్నారు. చిరుత మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఆదిలాబాద్ లోకి ప్రవేశించిందన్నారు. పశువులు మేత మేస్తున్న సమయంలో చిరుత వాటిపై దాడి చేయబోయింది. ఈ క్రమంలోనే మహిళ కదలికలను గమనించిన చిరుత ఆకస్మాత్తుగా ఆమె దాడి చేసిందని మంత్రికి వివరించారు. 

గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించామని చెప్పారు. చిరుత దాడి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, చిరుత కదలికలపై నిఘా పెట్టాలని పీసీసీఎఫ్‌‌‌‌‌‌‌‌కు మంత్రి సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో పులులు, చిరుతల సంచారం పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.