
భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు అమర్చిన ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్) పేలి ఆదివాసీ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా భీమారం గ్రామానికి చెందిన మడకం సుక్కీ ఇంటి సమీపంలో మంగళవారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో కాలికి తీవ్రగాయమైంది. బాధితురాలికి సుక్మాలో చికిత్స అందిస్తుండగా, విషయం తెలుసుకున్న ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ వెంటనే ఆమెను రాయ్‌పూర్‌కు తరలించాలని ఆదేశించారు. ఈ ఘటనలో ఆమె కాలు పూర్తిగా ఛిద్రమైంది. ప్రస్తుతం సుక్కీ రాయ్‌పూర్‌లో చికిత్స పొందుతోంది. మావోయిస్టులు సామాన్యుల ప్రాణాలను తీస్తున్నారని డిప్యూటీ సీఎం విజయ్శర్మతత ఆరోపించారు.