మావోయిస్టుల మందుపాతరకు ఆదివాసీ మహిళ బలి

మావోయిస్టుల మందుపాతరకు ఆదివాసీ మహిళ బలి

భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఆదివాసీ మహిళ చనిపోయింది. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్​స్టేషన్​పరిధిలోని దబ్బమార్క గ్రామానికి చెందిన కొవ్వాసి సుక్కీ సోమవారం పశువులను మేపడానికి గ్రామ సమీపంలోని అడవుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేసింది. అది పేలడంతో అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై కిష్టారం పోలీస్​స్టేషన్లో కేసు నమోదైంది.