నెక్కొండ, వెలుగు: గ్రామ పంచాయతీ భవనాన్ని తమ తండాలోనే నిర్మించాలంటూ నెక్కొండ మండలం అజ్మీరమంగ్యా తండాకు చెందిన గిరిజనులు సోమవారం వాటర్ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2018లో అజ్మీరమంగ్యా తండా కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న ఏడు తండాలను కలిపి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారన్నారు. గతేడాది డిసెంబర్లో కొత్త గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణానికి ఈజీఎస్ ఫండ్స్‌నుంచి రూ.15లక్షలు రిలీజ్ అయ్యాయని తెలిపారు. అయితే ఆ బిల్డింగ్‌ను అజ్మీరమంగ్యా తండాలో నిర్మించకుండా సర్పంచ్ సొంతూరైన ఐనబోరింగ్తండాలో నిర్మిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్ సరోజన వెంకట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ డబ్బాలతో వాటర్‌ట్యాంక్ ఎక్కారు. విషయం తెల్సుకున్న ఎస్సై నాగరాజు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఇవి కూడా చదవండి
భద్రాద్రిలో నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు
అప్పుడు పబ్.. ఇప్పుడు వైల్డ్‌లైఫ్ హాస్పిటల్
రింగు డాన్స్‌తో గిన్నిస్ రికార్డ్
కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది