చండ్రుగొండ, వెలుగు : మండంలోని బెండాలపాడు గ్రామం శివారులోని ఎర్రబోడులో తాగునీటి ఎద్దడి తీర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక ఎంపీడీవో ఆఫీసు ముందు గొత్తికోయ గిరిజనులు ఆందోళన చేశారు. ఎర్రబోడులో 47 కుటుంబాలు నివసిస్తున్నాయని, తాగునీరు లేక చెరువులు, చెలిమ నీళ్లు తాగుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చేతిపంపు ఏర్పాటు చేయాలని కోరారు
ఎంపీడీవో ఆఫీస్ ఇన్చార్జి శ్రీనివాసరావుకు వినతిప్రతం అందజేశారు. ఈ కార్యక్రమంలో గొత్తికోయల ప్రతినిధి వెంకట్రావు, గొత్తికోయలు రాఘవ, గణేశ్, మన్ను, సింగ, రవి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.