ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్  జిల్లా సంక్షిప్త వార్తలు
  • పోడు భూములకు పట్టాలివ్వండి
  • ఆర్డీఓ ఆఫీస్ ముందు గిరిజనుల ధర్నా

మంథని, వెలుగు : పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ మంథని మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గిరిజనులు బుధవారం ఆర్డీఓ ఆఫీస్​ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 86లో ఉన్న 209 ఎకరాల భూమిలో తాము 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామన్నారు. ఫారెస్ట్ అధికారులు ఆ భూమి ప్రభుత్వానిదంటూ కందకాలు తీస్తూ గిరిజనులను భూమిలోకి అడుగుపెట్టనివ్వడంలేదన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం మంథని ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గణేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, సత్యం, ప్రభాకర్, లక్ష్మి, ఎర్రక్క, మల్లక్క, రేవతి, మేకల లక్ష్మి, దేవక్క, గిరిజనులు పాల్గొన్నారు.

  • ఎన్ని మీటర్లు ఉన్నా ఒక్కటే ఓటు
  • సెస్ ఎన్నికల అథారిటీ ఆఫీసర్​ సుమిత్ర 

సిరిసిల్ల టౌన్, వెలుగు: సెస్ విద్యుత్ వినియోగదారులకు ఎన్ని మీటర్లు ఉన్నా ఒక్కటే ఓటు ఉంటుందని రాష్ట్ర సహకార శాఖ అదనపు రిజిస్టర్, సెస్ ఎన్నికల అథారిటీ సుమిత్ర అన్నారు. జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సెస్ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్ని విద్యుత్ సర్వీసులు ఉన్నా ఒక్కటే ఓటు ఉంటుందని, ఏ ఒక్క సర్వీస్ పై బకాయి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకునే, పోటీ చేసే అవకాశం ఉండదని తెలిపారు. 16వ తేదీలోగా తుది జాబితాను సిద్ధం చేస్తామన్నారు. లిస్ట్​లో పేర్లు లేనివారు సంబంధిత అధికారులకు తెలపాలని కోరారు. నవంబర్ 1 లోపు సభ్యులుగా ఉన్న వారికి ఓటు హక్కు, పోటీ చేసే అవకాశం ఉంటుందని సుమిత్ర తెలిపారు. సమావేశంలో సహకార శాఖ అధికారి బుద్ధనాయుడు, సెస్ ఎండీ రామకృష్ణ పాల్గొన్నారు. 

  • సమస్యలు వెంటనే పరిష్కరించండి
  • కేంద్ర మంత్రికి ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ మాజీ ఉద్యోగుల వినతి

గోదావరిఖని, వెలుగు : మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ)లో పనిచేసిన తమ సమస్యలు పరిష్కరించాలని మాజీ ఉద్యోగులు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖుబాను కోరారు. బుధవారం ఎన్టీపీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి సమక్షంలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. 1992, 1997 సంవత్సరాలకు సంబంధించి వేజ్ రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుండానే 2002లో ఉద్యోగులందరిని బలవంతంగా వలంటరీ సప్రెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద తొలగించారని మంత్రికి తెలిపారు. ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగుల వారసులకు అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ జీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, టి.స్వామిదాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బి.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వి.రంగయ్య, పి.రామయ్య, జి.నర్సయ్య, రాజమౌళి, రాజమల్లు, సంజీవరెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

  • ఓపెన్ ప్లాట్లను సొంతం చేసుకోండి
  • అడిషనల్ ​కలెక్టర్లు గరిమ, శ్యాంప్రసాద్ లాల్

తిమ్మాపూర్, వెలుగు: మండలంలోని నుస్తులాపూర్ లో ప్రభుత్వం నిర్వహిస్తున్న వేలంలో పాల్గొని అంగారక టౌన్ షిప్ ప్లాట్లను సొంతం చేసుకోవాలని అడిషనల్​కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన 2వ ప్రీబిడ్ సమావేశంలో వారు మాట్లాడారు. సర్వే నంబరు 556, 557లో నివాస, వాణిజ్య అవసరాల కోసం 819 ప్లాట్లకుగాను తుదిదశలో 656 పాట్లు వేలం వేస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ.10 వేలు ధరావతు చెల్లించి 13వ తేదీలోగా కలెక్టర్, కరీంగర్  రాజీవ్ స్వగృహ పేరిట డీడీ తీసి కరీంనగర్ మున్సిపాలిటీ సుడా ఆఫీస్​లోసమర్పించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, సుడా సీపీఓ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

  • విద్య, మౌలిక  వసతుల కల్పనే లక్ష్యం


జగిత్యాల రూరల్/రాయికల్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీ  చైర్ పర్సన్ వసంత తో కలిసి ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం బల్దియా చైర్ పర్సన్ భోగ శ్రావణి తో కలిసి చింతకుంట, పెద్ద చెరువు, అనంతరం, లింగం చెరువులో చేపలను వదిలారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ అశ్విని, ఎంపీపీ సంధ్యారాణి, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

  • ప్రజల మధ్య అంతరాలు తగ్గలే
  • రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ  చైర్మన్ ప్రకాశ్​రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: భారత ఆర్థికవ్యవస్థ  వృద్ధి సాధించినప్పటికీ ప్రజల మధ్య అంతరాలు మాత్రం తగ్గలేదని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్​రావు అన్నారు. బుధవారం కరీంనగర్​లోని శాతవాహన యూనివర్సిటీలో ‘75 సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై రెండ్రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో పాల్గొన్నారు. వీసీ సంకశాల మల్లేశ్, డాక్టర్ కోడూరు శ్రీవాణితో కలిసి సావనీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ఎంతో మారిందన్నారు. కానీ ఇంకా పేదరికం, నిరుద్యోగం తొలగిపోలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తున్నాయని, ఇది మంచి పరిణామం కాదని అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పరవాకర్ సాహు, రిజిస్ట్రార్ వరప్రసాద్
 పాల్గొన్నారు. 

  • అసభ్యంగా ప్రవర్తించాడని చంపేసిన్రు
  • సీనియర్ మేట్ హత్య వివరాలు వెల్లడించిన పోలీసులు
  • దంపతుల అరెస్ట్, పరారీలో మరొకరు

సైదాపూర్, వెలుగు: తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఉపాధి హామీ పథకం సీనియర్​ మేట్​ను హత్య చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామానికి చెందిన ఉపాధి పథకం సీనియర్ మేట్ హత్య కేసు వివరాలను ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి బుధవారం వెల్లడించారు. సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామానికి చెందిన గౌరవేని జయంత్ భార్య శారద ఉపాధి హామీ పథకం కూలి పనులకు పోతుండేది. ఇదే గ్రామానికి చెందిన మేదర శ్రీనివాస్(34)  గ్రామంలో సీనియర్ మేట్​గా చేస్తున్నాడు. కొన్ని రోజులుగా శారద ముభావంగా ఉండడంతో జయంత్ ఏం జరిగిందని అడిగాడు. శ్రీనివాస్ తనతో అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని, కోరిక తీర్చమని వెంటపడుతున్నాడని శారద చెప్పింది. దీంతో శ్రీనివాస్ అంతు చూస్తానని జయంత్ తన భార్యకు మాట ఇచ్చాడు. హత్యకు కుట్రపన్నిన జయంత్ తన చిన్నాన్న కొడుకు గౌరవేని అజయ్ సాయం కోరాడు. అప్పటి నుంచి జయంత్, అజయ్ పథకం ప్రకారం శ్రీనివాస్ తో స్నేహం చేస్తూ పలుసార్లు దావత్ చేసుకున్నారు.

ఈ నెల 5న రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో జయంత్ దావత్ చేసుకుందాం రమ్మని శ్రీనివాస్ ను పిలిచాడు. గ్రామంలోని బెల్ట్ షాపులో మద్యం తీసుకుని ముగ్గురు కలిసి ఆకునూరు గ్రామ శివారులోని జయంత్ పశువుల కొట్టం దగ్గర తాగారు. శ్రీనివాస్​మత్తులో ఉన్న సమయంలో జయంత్, అజయ్​అతడి మెడకు తాడు వేసి చెరోవైపు బలంగా లాగుతూ హతమార్చారు. తర్వాత మృతదేహాన్ని శ్రీనివాస్ బైక్​పై కొట్టం నుంచి వ్యవసాయ భూమిలోని మొరం కుప్ప వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ గుంత తీసి పాతిపెట్టారు. మరుసటి రోజు ఉదయం బ్లేడ్​ట్రాక్టర్ సహాయంతో శవాన్ని కనిపించకుండా లెవల్ చేశాడు. ఈ నెల 7న శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ సైదాపూర్ పోలీస్ స్టేషన్​లో మిస్సింగ్ ​కేసు పెట్టాడు. ఎలాగైనా దొరికిపోతామనే భయంతో జయంత్ భార్య శారదతో కలిసి పోలీసులకు లొంగిపోయాడు. మరో నిందితుడు అజయ్ పరారీలో ఉన్నాడని, మరో ఇద్దరికి(రమేశ్, తిరుపతి) కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉందని పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

  • ప్రధాని పర్యటనపై ఆఫీసర్ల అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఏర్పాట్లు పరిశీలించిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ ఏఐజీ

గోదావరిఖని, వెలుగు: ఈనెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రామగుండంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల ఆఫీసర్లు అలర్టయ్యారు. బుధవారం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐజీ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. ఎరువుల శాఖ జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ సంగీత, మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వామి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగీత, రామగుండం సీపీ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీసీపీలు అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూపేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు ఎరువలు ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సభా స్థలిని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఎన్టీపీసీ మిలీనీయమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు ఏర్పాట్లపై సమీక్షించారు. 

కోతలు విధిస్తే కఠిన చర్యలు

మల్లాపూర్, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతులకు కోతలు విధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని మొగిలిపేట, కొత్త దామరాజ్ పల్లి , పాత్త దామరాజు పల్లి, మల్లాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.  కార్యక్రమంలో ఎంపీపీ సరోజన, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, ఐకేపీ ఏపీఎం రాజేశ్, సర్పంచులు నాగరాజు, సరిత, శ్రీనివాస్, ఎంపీటీసీ సుజాత, లక్ష్మి, రాజేశ్ పాల్గొన్నారు.