పట్టాలు ఇవ్వాలని గిరిజనుల పాదయాత్ర

ఖిల్లాగణపురం, వెలుగు: మండలంలోని మామిడిమాడ, శాపూరు గ్రామాల శివారులో 480 ఎకరాల భూమిని సాగు చేస్తున్న తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ గిరిజనులు శుక్రవారం జిల్లా కేంద్రానికి పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని వెనికితండా, ముందరితండా, మేడిబాయితండా, బక్కతండా, కర్నెతండా, ఆముదాలబండ తండా, బిజినేపల్లి మండలం భీమునితండా, మిట్టతండా గిరిజనులు 150 ఏండ్లుగా రాజాబహదూర్​ కరణ్​చంద్, శ్యాంకరణ్​ పేరిట ఉన్న భూమిని సాగుచేసుకుంటున్నారు. 

2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌019లో అప్పటి కలెక్టర్​ సీసీఎల్ఏకు రిపోర్ట్​ పంపారని, అయినప్పటికీ పట్టాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ల్యాండ్​ సీలింగ్​  యాక్ట్​ ప్రకారం సాగులో ఉన్న వారికి పట్టాలు ఇప్పించాలని గిరిజన సంఘాల నాయకులు కోరారు. కృష్ణానాయక్, బాల్యానాయక్, జాత్రునాయక్, ఆంజనేయులు, వెంకటరాములు, నిక్సన్​ పాల్గొన్నారు. అనంతరం వనపర్తి ఆర్డీవో సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు.