లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి ..కాంగ్రెస్ అగ్రనేతలకు లంబాడీ ఎమ్మెల్యేల లేఖ

లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి ..కాంగ్రెస్ అగ్రనేతలకు లంబాడీ ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 32 లక్షల జనాభా ఉన్న లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ కు బుధవారం రాష్ట్రంలోని లంబాడీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. అనంతరం ఎమ్మెల్యేలు బాలు నాయక్, విప్ రాంచంద్ర నాయక్, రాందాస్ నాయక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.

త్వరలో విస్తరించనున్న కేబినెట్ లో తమకు చోటు కల్పించాలని సీఎంను కోరారు. కాంగ్రెస్ కు అండగా నిలిచిన లంబాడీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి, రాజకీయ ప్రోత్సహించాలన్నారు. అంతకుముందు అసెంబ్లీ లాబీలో బాలు నాయక్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో లంబాడీల మద్దతు కీలకమైందని, సుమారు 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను గెలిపించడంలో లంబాడీలు పనిచేశారని చెప్పారు.