ఆదివాసీల ఆత్మబంధుహైమన్‌‌‌‌‌‌‌‌ డార్ఫ్‌

  • మార్లవాయిలో సంప్రదాయబద్ధంగా నివాళి 
  • హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్, ఐటీడీఏ పీఓ  
  • ఆదివాసీలు విద్యావంతులుగా ఎదగాలనేదే  డార్ఫ్ ఆశయం

జైనూర్, వెలుగు: ఆదివాసీల ఆత్మబంధు హైమన్ డార్ఫ్ అని వక్తలు కొనియాడారు. శనివారం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజిబెత్ దంపతుల 38వ వర్ధంతి సందర్భంగా  ఆదివాసీలు ఘన నివాళి అర్పించారు.  ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు పాల్గొని డార్ఫ్ సమాధుల వద్ద  సంప్రదాయ పూజలు చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, ఏఎస్పీ చిత్తరంజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ  తదితరులు పాల్గొన్నారు. 

ఆదివాసీల అభివృద్ధి కోసం ఏకమవుదాం

హైమన్ డార్ఫ్ ఆశయ సాధనకు  ఆదివాసీల అభివృద్ధి కోసం ఏకమై పని చేద్దామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్  అన్నారు.  ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ , ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్ జిల్లా అధికారులు హాజరై నివాళులు అర్పించారు.  గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ ప్రారంభించారు.  కలెక్టర్ మాట్లాడుతూ..  విద్యా, అభివృద్ధితో పాటు రోడ్లు లేని గ్రామాల్లో ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు.  ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ..  ఆదివాసీ గ్రామాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ..   సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదివాసీల సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చారని తెలిపారు.